Discover the most important news that shaped this week. From breaking developments to in-depth analysis.
రష్యా చమురుపై అమెరికా కఠిన చర్యలు.. భారత్కు ప్రభావం?
📅 08-08-2026
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాలను అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. 86-11 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టంగా మారితే భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. రష్యాకు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
శ్రీశైలానికి భారీ వరద.. 200 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ
📅 08-08-2026
కృష్ణా నది నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శుక్రవారం రాత్రి నాటికి జూరాల ప్రాజెక్టు నుంచి 2,57,059 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కాగా, శ్రీశైలానికి 2,11,331 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 874.70 అడుగులకు చేరింది. నీటి నిల్వ 162.819 టీఎంసీలుగా ఉంది. మరో మూడు రోజుల్లో నిల్వ 200 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
📅 07-08-2026
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు, రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచించారు.