ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. 66 బంతుల్లో 69 పరుగులు చేసిన రూట్, వన్డే క్రికెట్లో ఇంగ్లాండ్ తరఫున 8 వేల పరుగుల మార్క్ దాటిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో జో రూట్ వన్డేల్లో తన మొత్తం పరుగులను 8,005కు చేర్చుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ అగ్రస్థానంలో ఉండగా, ఇయాన్ మోర్గాన్ 6,957 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. జోస్ బట్లర్ 5,678, ఇయాన్ బెల్ 5,416, పాల్ కొలింగ్‌వుడ్ 5,092 పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
అయితే ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 15,109 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కుమార సంగక్కర, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య కూడా అగ్రస్థానాల్లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్ 429 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ శ్రీలంక అద్భుత ఛేదన చేసింది. 430 పరుగుల లక్ష్యాన్ని 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేరుకుని వన్డే చరిత్రలో రెండో అత్యధిక విజయవంతమైన ఛేదనగా రికార్డు నమోదు చేసింది.
వన్డేల్లో జో రూట్ అరుదైన ఘనత.. ఇంగ్లాండ్ తరఫున 8 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్
10