బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖకు చెందిన అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తాజా వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం జూలై 16 ఉదయం నాటికి బలమైన అల్పపీడన ప్రాంతంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ రాబోయే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాల వైపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్–యానాం ప్రాంతాల్లో గురువారం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
శుక్రవారం కూడా ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగవచ్చని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శనివారం కూడా జల్లులు కురిసే అవకాశముండగా బలమైన గాలులు కొనసాగవచ్చని అంచనా వేశారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండగా, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని హెచ్చరించింది. వేడి, తేమ
బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan