ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూల స్పందన.. ఏపీ జేఏసీ నేతల హర్షం
📅 06-09-2026
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంపై ఏపీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీ, డీఏలు, సరెండర్ లీవులు, హెల్త్ కార్డులు, పెన్షనర్ల అదనపు క్వాంటమ్ పెన్షన్ వంటి అంశాలపై సీఎంతో చర్చలు జరిగాయని ఏపీ జేఏసీ ఛైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండింటిని ఒకే నెలలో చెల్లిస్తామని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.