హౌతీల దాడుల కారణంగా సౌదీ అరేబియా ఎదుర్కొంటున్న పరిస్థితులు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా మద్దతు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వైఖరిపై సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) అసంతృప్తిగా ఉన్నారని అమెరికా మాజీ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి కరెన్ గిబ్సన్ వ్యాఖ్యానించారు.
హౌతీల దాడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సౌదీ అరేబియా, హౌతీలపై సైనిక చర్యకు అమెరికా సహకరించాలని కోరినట్లు సమాచారం. సౌదీ నగరాలు, చమురు మౌలిక వసతులు, ఇతర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
అయితే ట్రంప్ ప్రభుత్వం హౌతీలపై ప్రత్యక్ష వైమానిక దాడులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై ఎంబీఎస్ అసంతృప్తిగా ఉన్నారని కరెన్ గిబ్సన్ పేర్కొన్నారు. తన విజ్ఞప్తిని ట్రంప్ పట్టించుకోకపోవడాన్ని సౌదీ యువరాజు సులభంగా మర్చిపోలేరని ఆమె వ్యాఖ్యానించారు.
మరోవైపు, హౌతీలతో చర్చలు జరిపినట్లు ట్రంప్ వెల్లడించడం కూడా సౌదీ ఆందోళనకు కారణమవుతోందని కథనం పేర్కొంది. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా దాడులు చేయబోమని హౌతీలు హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు.
అమెరికా నుంచి ప్రత్యక్ష సహకారం పరిమితమైనప్పటికీ, బ్రిటన్ సౌదీ రక్షణ దళాలకు ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ సౌకర్యాలు అందించనున్నట్లు ప్రకటించినట్లు సమాచారం.
హౌతీలపై అమెరికా సాయం అందకపోవడంపై సౌదీ యువరాజు ఆగ్రహం.. ట్రంప్‌పై కీలక వ్యాఖ్యలు
0
Published: 📅
Reported by: 🖊
Banu Prakash