దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. జొహాన్నెస్‌బర్గ్ సమీపంలోని వెస్ట్‌రాండ్ జిల్లాలో ఓ పబ్‌లో జరిగిన కాల్పుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.
శనివారం సాయంత్రం పబ్‌లో కొందరు మద్యం సేవిస్తున్న సమయంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. పిస్టల్స్, ఏకే-47 తుపాకులతో వచ్చిన వారు మొదట పబ్ బయట ఉన్న వారిపై కాల్పులు జరిపి, అనంతరం లోపలికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో మృతుల్లో 13 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. కాల్పుల అనంతరం నిందితులు కొందరి నుంచి సెల్‌ఫోన్లు తీసుకుని రెండు వాహనాల్లో అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాల్పులకు అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికాలో కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతవారం డర్బన్ నగరంలో జరిగిన మరో కాల్పుల ఘటనలో గర్భిణితో సహా 11 మంది మృతి చెందినట్లు సమాచారం. జూన్‌లో ఓ సబర్బన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించారు.
తాజా ఘటనతో భద్రతా పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. నిందితులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దక్షిణాఫ్రికా పబ్‌లో కాల్పుల కలకలం.. 17 మంది మృతి, 15 మందికి గాయాలు
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk