ప్రస్తుతం యూపీఐ సేవలు డిజిటల్ చెల్లింపులను చాలా సులభతరం చేశాయి. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా కొన్ని సెకన్లలోనే డబ్బులు పంపించే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు తొందరపాటు లేదా పొరపాటు కారణంగా పంపాల్సిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి డబ్బులు బదిలీ అవుతుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా చేయాల్సింది బ్యాంకును సంప్రదించడం. తప్పుడు యూపీఐ లావాదేవీ జరిగిన విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. కస్టమర్ కేర్ లేదా సమీప బ్యాంకు బ్రాంచ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లావాదేవీ తేదీ, యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ, పంపిన మొత్తం వంటి పూర్తి వివరాలను అందించాలి.
అలాగే మీరు ఉపయోగించిన యూపీఐ యాప్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు చేసిన తర్వాత బ్యాంకు వాపసు ప్రక్రియను ప్రారంభిస్తుంది. అయితే ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగితే డబ్బులు తిరిగి పొందే అవకాశాలు తగ్గవచ్చు. కాబట్టి సమస్య తెలిసిన వెంటనే చర్యలు తీసుకోవాలి.
ఫిర్యాదు చేసినప్పుడు బ్యాంకు నుంచి ఫిర్యాదు సంఖ్య లేదా రిఫరెన్స్ నంబర్ తీసుకోవడం తప్పనిసరి. ఇది భవిష్యత్తులో లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
పొరపాటున డబ్బులు అందుకున్న వ్యక్తికి పదేపదే ఫోన్ చేయడం, బెదిరించడం వంటి చర్యలు చేయకూడదు. సమస్యను చట్టబద్ధంగా బ్యాంకు మార్గంలోనే పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.
తప్పుడు యూపీఐ నంబర్‌కు డబ్బులు పంపారా?.. తిరిగి పొందాలంటే ఇలా చేయండి
3
Published: 📅
Reported by: 🖊
Sarika Sk