ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్‌కు మరో అరుదైన ఘనత లభించింది. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ భరణికా ఇలంగోవన్ చరిత్ర సృష్టించింది. 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి ఆమె కాంస్య పతకం సాధించింది. ఆసియా క్రీడల పోల్ వాల్ట్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా భరణికా రికార్డు నెలకొల్పింది.
29 ఏళ్ల భరణికాతో పాటు కజకిస్థాన్‌కు చెందిన పోలినా ఇవనోవా కూడా 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి కాంస్య పతకం అందుకుంది. ఇద్దరూ 4.25 మీటర్ల ఎత్తును దాటడంలో విఫలమవడంతో సంయుక్తంగా మూడో స్థానం దక్కింది. ఆతిథ్య దేశం జపాన్‌కు చెందిన మిసాకి మోరోటా 4.55 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించగా, చైనాకు చెందిన చుంగే నియు 4.50 మీటర్లతో రజతం గెలుచుకుంది.
భరణికా ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు రికార్డులు నెలకొల్పింది. 2026 మార్చిలో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 4.22 మీటర్ల ఎత్తును అధిగమించి జాతీయ రికార్డు సాధించింది. అనంతరం మేలో జరిగిన పోటీల్లో 4.23 మీటర్లతో తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది.
మరోవైపు మహిళల షాట్‌పుట్ ఫైనల్‌లో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ కూడా కాంస్య పతకం సాధించింది. ఆమె 17.17 మీటర్ల దూరం విసిరి ఆసియా క్రీడల్లో తొలి పతకాన్ని అందుకుంది.
ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భరణికా.. పోల్ వాల్ట్‌లో భారత్‌కు కాంస్యం
10
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk