డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు వెళ్తున్న ఓ విమానం కేంజ్ ప్రాంతంలో కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాంగో సైన్యానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సైనిక న్యాయస్థానం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండె, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా మృతుల్లో ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
విమానం కేంజ్ ప్రాంతంలో కూలిపోవడానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రమాదం ఈస్ట్ కాంగోలో సైన్యం తిరుగుబాటు దళాలతో పోరాడుతున్న సమయంలో జరిగింది. ముఖ్యంగా రువాండా మద్దతు ఉందని కాంగో ఆరోపిస్తున్న M23 తిరుగుబాటు దళాలతో అక్కడ ఘర్షణలు కొనసాగుతున్నాయి.
ఇటీవలి కాలంలో తిరుగుబాటు దళాల దాడులు తీవ్రతరం కావడంతో ఈస్ట్ కాంగోలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సైనిక అధికారులు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్స్ సహా 14 మంది మృతి
8
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk