ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా డ్రోన్ దాడులు చేసింది. శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
ఈ దాడుల్లో అమెరికా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన ఓ గోదాము కూడా లక్ష్యంగా మారింది. కీవ్‌లోని బ్రోవరీ జిల్లాలో ఉన్న ఈ గోదాముపై రష్యా డ్రోన్లు రెండుసార్లు దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
కీవ్ రీజినల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి తైమూర్ తకాచెంకో వివరాల ప్రకారం, మొదటి దాడి శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జరిగింది. అనంతరం అదే గోదాముపై మరోసారి దాడి జరిగింది. రెండో దాడి తర్వాత గిడ్డంగిలో భారీగా మంటలు చెలరేగాయి.
ఆహార ఉత్పత్తులను నిల్వ చేసే విభాగం పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు కీవ్ రీజినల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. గోదాముతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. పౌర మౌలిక సదుపాయాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామి గోదాముపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, సాధారణ ఆహార సరఫరాలపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఈ డ్రోన్ దాడుల వల్ల జరిగిన నష్టంపై ఉక్రెయిన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఘటనపై పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.
కీవ్‌పై రష్యా డ్రోన్ దాడులు.. ఐదుగురు మృతి, 27 మందికి గాయాలు
5
Published: 📅
Reported by: 🖊
Kanakadri