న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో భారత్-పాకిస్థాన్‌కు సంబంధించిన అంశంపై ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు.
భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ పాకిస్థాన్ జర్నలిస్ట్ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన జైశంకర్ తీవ్రంగా బదులిచ్చారు. "ఒక టెర్రరిస్ట్ కంట్రీ నన్ను ఆ ప్రశ్న అడుగుతోందా?" అంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
లైబీరియా విదేశాంగ మంత్రి సారా బెయిసోలో న్యాంటీతో కలిసి జైశంకర్ న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడారు. వాణిజ్య నౌకలు, నావికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించిన మీడియా సమావేశంలో ఈ ఘటన జరిగింది.
ఇద్దరు మంత్రులు తమ ప్రసంగాలు ముగించిన తర్వాత పాకిస్థాన్ జర్నలిస్ట్ జైశంకర్‌ను ప్రశ్నించారు. "పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని మీ ప్రభుత్వం ఎప్పుడు ఆపుతుంది?" అని ప్రశ్నించగా, జైశంకర్ స్పందించారు.
ఈ ఘటనకు ఒక రోజు ముందు ఐక్యరాజ్యసమితి భవనంలోకి వెళ్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను భారత జర్నలిస్ట్ కూడా ప్రశ్నించారు. "ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?" అని అడిగినప్పటికీ, షెహబాజ్ షరీఫ్ స్పందించకుండా వెళ్లిపోయారని కథనం పేర్కొంది.
పాక్ జర్నలిస్ట్ ప్రశ్నకు జైశంకర్ ఘాటు సమాధానం.. యూఎన్ వేదికగా స్పందన
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk