దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ, వాతావరణ సదస్సు ప్రారంభమైంది. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్‌జీటీ) సెప్టెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు 17 దేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణలో భారత్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ‘పీఎం సూర్యఘర్’ పథకం విజయవంతమైందని, దేశవ్యాప్తంగా 50 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలను అందిస్తోందని పేర్కొన్నారు.
కర్బన ఉద్గారాల అంశంపై కూడా ప్రధాని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను అనవసరంగా నిందించకూడదని, అభివృద్ధి చెందిన దేశాల తలసరి కర్బన ఉద్గారాలు భారత్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పర్యావరణ, వాతావరణ సవాళ్లపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరగనున్నాయి. పర్యావరణ విధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో ఉన్న అంశాలతో పాటు వాతావరణ న్యాయం, జీవవైవిధ్యం, పర్యావరణ చట్టాలు, పునరుత్పాదక ఇంధనం, అడవుల పరిరక్షణ వంటి అంశాలపై నిపుణులు చర్చలు నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ప్రధాని మోదీ.. భారత్ వాతావరణ చర్యలపై కీలక వ్యాఖ్యలు
7
Published: 📅
Reported by: 🖊
Kanakadri