భారతీయ రైల్వే పర్యావరణహిత రవాణా రంగంలో కీలక ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దేశంలోని తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 17న హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ‘నమో గ్రీన్ రైల్’గా పేరుపొందిన ఈ రైలు జింద్–సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో నడవనుంది.
ఈ రైలును భారత్‌లోనే రూపకల్పన చేసి, ఇంజినీరింగ్, సమీకరణ చేపట్టారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సాంకేతిక ప్రమాణాలను రూపొందించగా, మేధా సర్వో డ్రైవ్స్ రైలు వ్యవస్థను సమీకరించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రైలు థీమ్, బాహ్య రూపకల్పనలో భాగస్వామ్యం వహించింది.
మొత్తం పది కోచ్‌ల రైలులో రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ట్రైలర్ కోచ్‌లు ఉన్నాయి. ఒక్కో పవర్ కారులో ఫ్యూయల్ సెల్స్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు, హైడ్రోజన్ సిలిండర్లు అమర్చారు. సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల నిర్వహణ వేగంతో నడుస్తుంది. సాంకేతిక రూపకల్పన వేగం గంటకు 110 కిలోమీటర్లు.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌లో నిల్వ చేసిన హైడ్రోజన్, వాతావరణంలోని ఆక్సిజన్‌తో రసాయన చర్య జరుపుతుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ ట్రాక్షన్ మోటార్లకు చేరి రైలును నడుపుతుంది. ప్రత్యక్ష ఉద్గారాలుగా నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకు వస్తాయి. డీజిల్ రైళ్ల మాదిరిగా ఇంధన దహనం, పొగ లేదా టెయిల్‌పైప్ కార్బన్ ఉద్గారాలు ఉండవు. అయితే హైడ్రోజన్‌ను ఏ విద్యుత్ వనరుతో తయారు చేశారన్న అంశం మొత్తం కార్బన్ ప్రభావాన్ని నిర్ణయిస్తుంది.
రైలుకు అవసరమైన హైడ్రోజన్‌ను జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్‌లో నీటి విద్యుద్విశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేస్తారు. అక్కడ దాదాపు 3,000 కిలోల హైడ్రోజన్‌ను నిల్వ చేయగల సదుపాయం ఉంది. హైడ్రోజన్‌ను 500 బార్‌కు కంప్రెస్ చేసి, 350 బార్ నియంత్రిత పీడనంతో రెండు పవర్ కార్లకు ఒకేసారి నింపేలా
జింద్‌లో భారత్ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
12
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan