వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ దృష్టి సారించిన నేపథ్యంలో వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రపంచకప్ ప్రణాళికల్లో చోటు ఉంటుందా అనే చర్చ కొనసాగుతోంది. దీనిపై స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించారు.
జడేజాతో పాటు అక్షర్ పటేల్ కూడా అందుబాటులో ఉన్నారని బహుతులే తెలిపారు. రాబోయే టోర్నీలు, సిరీస్‌ల్లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించి, జట్టుకు ఎవరు ఎంత ఉపయోగపడతారో అంచనా వేస్తామని చెప్పారు. జడేజా తన బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు ఎంతో అనుభవాన్ని తీసుకొస్తాడని, బ్యాట్‌తోనూ బంతితోనూ జట్టుకు సహకరించగల యుటిలిటీ ప్లేయర్‌గా అతడిని చూస్తామని పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో బౌలర్‌గా కూడా జడేజా మెరుగయ్యాడని తెలిపారు.
మరోవైపు, హార్దిక్ పాండ్య గాయం, పలువురు ఆటగాళ్లు ఆసియా క్రీడలకు వెళ్లడంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా పలు బౌలింగ్ కాంబినేషన్లను పరీక్షిస్తోంది. నితీశ్ కుమార్ రెడ్డికి కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం కూడా ఇందులో భాగమేనని బహుతులే చెప్పారు. ప్రపంచకప్‌కు ముందు వివిధ దశల్లో బౌలింగ్ చేయగల ఆటగాళ్లను పరీక్షిస్తూ, దక్షిణాఫ్రికా పరిస్థితులకు సరిపోయే కాంబినేషన్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
వన్డే ప్రపంచకప్‌లో జడేజాకు చోటు ఉంటుందా? కోచ్ సాయిరాజ్ కీలక వ్యాఖ్యలు
3