హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ వైపు తరలించే భారీ వాహనానికి డ్రైవర్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ఆసక్తి భక్తుల్లో నెలకొంది. ఈ ఏడాది ఈ ప్రత్యేక బాధ్యత సూర్యాపేట జిల్లాకు చెందిన మందడి వెంకటరెడ్డికి దక్కింది.
ఆత్మకూర్(ఎస్) మండలానికి చెందిన వెంకటరెడ్డి ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు ఉపయోగించే భారీ ట్రక్‌ను నడపనున్నారు. లక్షలాది మంది భక్తుల మధ్య మహాగణపతిని సురక్షితంగా తరలించడం ఎంతో నైపుణ్యంతో కూడుకున్న పని. ఆయనకు ఉన్న అనుభవమే ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
వెంకటరెడ్డి విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టులో 26 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రలో రథసారథిగా వ్యవహరించారు. 2017, 2020, 2025 సంవత్సరాల్లో నిమజ్జనోత్సవ సమయంలో భారీ ట్రక్ డ్రైవర్‌గా సేవలు అందించారు.
2026లో మరోసారి తనకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. భారీ వాహనాన్ని లక్షలాది భక్తుల మధ్య జాగ్రత్తగా నడిపించడం బాధ్యతతో కూడిన పని అని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రతి ఏడాది హైదరాబాద్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భక్తుల రద్దీ మధ్య విగ్రహాన్ని తరలించడంలో డ్రైవర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఈసారి కూడా వెంకటరెడ్డి అనుభవంతో శోభాయాత్ర సాఫీగా సాగేందుకు సహకరించనున్నారు.
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు రథసారథి ఎవరో తెలుసా?.. సూర్యాపేట వెంకటరెడ్డికే అవకాశం
0