బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల భారీ హెచ్చుతగ్గులు నమోదైన పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే రూ.160 పెరిగి రూ.1,52,990కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,40,250గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,840గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,100గా నమోదైంది.
తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,100గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,630గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఆయా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840, 22 క్యారెట్ల ధర రూ.1,40,100, 18 క్యారెట్ల ధర రూ.1,14,630గా ఉంది.
మరోవైపు వెండి ధరలు ఢిల్లీలో కిలోకు రూ.2,45,000గా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, ఏపీ నగరాల్లో నేటి గోల్డ్ రేట్లు ఇవే
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri