శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈ సమన్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నెల 27వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. రూ.2.1 కోట్ల విలువైన లావాదేవీలకు సంబంధించి అధికారులు వివరాలు సేకరించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈ కేసులో దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
సాహితి ఇన్‌ఫ్రా కేసులో ఫ్రీ లాంచ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులను కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో గతంలో ఈడీ అధికారులు రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం. మరో విడతలో రూ.12.6 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేశారు. ఇప్పటివరకు 56 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
సాహితి ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను 2024లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగుతోంది.
సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan