భారత క్రికెట్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్ నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీ ఇప్పటికీ అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, మరో రెండు నుంచి మూడు సంవత్సరాలు టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం అతడికి ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. టెస్టు రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ ఆడాలని ఆయన సూచించారు.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ అజేయంగా 139 పరుగులు సాధించడంపై స్పందించిన కపిల్ దేవ్.. అతడి ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్‌ను ప్రశంసించారు. కోహ్లీ ఆడుతున్న తీరు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
“కోహ్లీ టెస్టు క్రికెట్‌కు ఎందుకు వీడ్కోలు పలికాడో నాకు తెలియదు. కానీ ఒక మాజీ ఆటగాడిగా, అభిమానిగా చూస్తే అతడు మరిన్ని టెస్టులు ఆడాల్సింది. అతడిలో ఆ సామర్థ్యం ఇంకా ఉంది” అని కపిల్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో కోహ్లీ తన నిర్ణయంపై ఆలోచించే అవకాశం ఉందని కపిల్ అన్నారు. ఆటపై ప్రేమ, శారీరక సామర్థ్యం ఉన్నప్పుడు టెస్టు క్రికెట్‌ను కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్‌కు, టెస్టు క్రికెట్‌కు చాలా తేడా ఉందని, టెస్టు ఫార్మాట్ కోహ్లీకి బాగా సరిపోతుందని చెప్పారు.
అయితే ఆటగాడిగా తన శరీరం, కెరీర్ పరిస్థితులను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకునే హక్కు కోహ్లీకే ఉందని కపిల్ దేవ్ స్పష్టం చేశారు. రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకోవాలా లేదా అనేది పూర్తిగా కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు.
కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకోవాలి: కపిల్ దేవ్
4
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan