బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట కలిగించేలా ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. బుధవారం పెరిగిన బంగారం ధరలు గురువారం యూటర్న్ తీసుకుని భారీగా తగ్గాయి. ఉదయం 10 గంటల సమయంలో నమోదైన ధరల ప్రకారం పసిడి ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.1,520 మేర తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,39,950గా నమోదైంది. ఇది నిన్నటితో పోలిస్తే రూ.1,400 తగ్గింది.
తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,950గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,510గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఆయా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,680, 22 క్యారెట్ల బంగారం రూ.1,39,950, 18 క్యారెట్ల బంగారం రూ.1,14,510గా ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.5 వేల మేర తగ్గి హైదరాబాద్, విజయవాడలో రూ.2.45 లక్షలుగా ఉంది.
బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను పరిశీలించాలని సూచించారు
భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, ఏపీ నగరాల్లో నేటి గోల్డ్ రేట్లు ఇవే
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri