భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కోనసీమ ప్రాంతంలో వరద పరిస్థితులపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 26 నాటికి గోదావరిలో 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సెప్టెంబర్ 27 నాటికి గోదావరి వరద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, పెరుగుతున్న వరద ప్రవాహంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
గత 24 గంటల్లో జిల్లాలో 114 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ హెచ్చరికల కోసం ‘అవేర్’ యాప్‌ను ఉపయోగించాలని అధికారులు సూచించారు. అత్యవసర సమస్యల పరిష్కారం కోసం జిల్లా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు అందిన రెండు గంటల్లో పరిష్కార చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
గోదావరికి వరద ముప్పు.. ఈనెల 26 నాటికి 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం
3
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk