అమెరికాలోని న్యూయార్క్ నగరానికి ప్రతీకగా నిలిచే టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు. భారతీయ, దక్షిణాసియా సమాజాలకు చెందిన వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వంటకాలతో దీపాల పండుగను జరుపుకున్నారు.
రోజంతా కొనసాగిన వేడుకల్లో ‘దీపావళి బజార్’, సంప్రదాయ దీపాల అలంకరణ, వన్ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ టవర్‌పై వర్చువల్ దీపావళి కౌంట్‌డౌన్, ‘లైట్ అప్ టైమ్స్ స్క్వేర్ కాన్సర్ట్’ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అమెరికన్ ర్యాపర్ రాజా కుమారి, గాయని కనికా కపూర్ తదితర కళాకారుల సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.
న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ్ ప్రధాన్‌తో పాటు న్యూయార్క్ గవర్నర్ తరఫున ఆసియన్ అమెరికన్ వ్యవహారాల డైరెక్టర్ షిబు నాయర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టైమ్స్ స్క్వేర్ వంటి అంతర్జాతీయ వేదికపై శాంతి, సామరస్యం, ఐక్యత అనే దీపావళి సందేశాన్ని పంచుకోవడమే తమ లక్ష్యమని నిర్వాహకురాలు నీతా భాసిన్ తెలిపారు.
2013లో ప్రారంభమైన ‘దివాలీ ఎట్ టైమ్స్ స్క్వేర్’ కార్యక్రమం ప్రతి ఏడాది భారతీయ సంస్కృతిని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఇదే సందర్భంగా న్యూయార్క్‌లోని ‘ది పీర్, ఏ తాజ్ హోటల్’ ప్రత్యేక భారతీయ విందును ఏర్పాటు చేసింది. ఛట్టి, జునూన్, ముసాఫిర్ రెస్టారెంట్లతో కలిసి ‘కలినరీ జర్నీ త్రూ ఇండియా’ పేరుతో భారతదేశంలోని వివిధ ప్రాంతీయ వంటకాలను అతిథులకు పరిచయం చేశారు.
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి సందడి.. భారతీయ సంస్కృతి, సంగీతం, వంటకాల వేడుక
5
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk