ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయి యంత్రాంగం నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించి, ఎక్కడైనా ప్రాణనష్టం జరిగిందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదని అధికారులు నివేదించారు.
కొన్ని జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈదురు గాలులు కొనసాగుతున్నాయని కలెక్టర్లు తెలిపారు. తుఫాన్ వల్ల ఆస్తి నష్టం తగ్గించేలా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చిన్న నీటిపారుదల చెరువుల్లో నీటి మట్టాలు, ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
చెరువులు పొంగిపొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సాగునీటి సంఘాలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టి, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. చెట్లు కూలిన ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు.
తుఫాన్ షెల్టర్లలో ఉన్న ప్రజలను పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఇళ్లకు పంపాలని చంద్రబాబు ఆదేశించారు. పంట నష్టంపై కూడా ఆయన ఆరా తీశారు. ప్రాథమికంగా అరటి, కొబ్బరి తోటలకు నష్టం జరిగినట్లు అధికారులు వివరించారు. పూర్తి నష్టంపై నివేదిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri