2027 పురుషుల వన్డే ప్రపంచకప్‌కు చివరి నాలుగు జట్లను నిర్ణయించే గ్లోబల్ క్వాలిఫయర్ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ పోటీలను ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు ESPNcricinfo వెల్లడించింది. అయితే టోర్నీని ఏ దేశంలో, ఏ మైదానాల్లో నిర్వహిస్తారనే వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఐసీసీ నుంచి పూర్తి మ్యాచ్ షెడ్యూల్ కూడా వెలువడలేదు.
క్వాలిఫయర్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. మార్చి 31, 2027 నాటి వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందని రెండు ఫుల్ మెంబర్ దేశాలు ఇందులో ఆడతాయి. వాటితోపాటు క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్–2లో తొలి నాలుగు స్థానాలు సాధించిన జట్లు, క్వాలిఫయర్ ప్లేఆఫ్ నుంచి ముందుకొచ్చే నాలుగు జట్లు పోటీపడతాయి.
క్వాలిఫయర్‌లో టాప్–4గా నిలిచిన జట్లన్నీ 14 జట్ల ప్రపంచకప్‌లో చోటు సంపాదిస్తాయి. తాజా ఫార్మాట్ ప్రకారం క్వాలిఫయర్ విజేత నేరుగా 12 జట్ల రెండో దశకు వెళ్లనుండగా, మిగిలిన మూడు క్వాలిఫైడ్ జట్లు ప్రపంచకప్ ప్రారంభ సూపర్ సిరీస్‌లో తలపడనున్నాయి. సూపర్ సిరీస్‌లో అగ్రస్థానంలో నిలిచే ఒక్క జట్టే రెండో దశకు చేరుతుంది.
2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ ఫిబ్రవరి 22 నుంచి.. వేదిక పెండింగ్
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan