ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మరింత ఉద్ధృతం అవుతున్నాయి. డ్రోన్లు, క్షిపణులను భారీగా వినియోగిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా దాదాపు 10 వేల ‘మెరోప్స్’ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను పశ్చిమాసియాలో మోహరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే ఈ డ్రోన్లు శత్రు ఆయుధాలను గుర్తించి నాశనం చేయగలవు. ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా ఈ మెరోప్స్ డ్రోన్లను భారీగా వినియోగిస్తున్నట్లు సమాచారం.
ఇరాన్ యుద్ధంలో డ్రోన్ల దాడులు తీవ్రం.. 10 వేల మెరోప్స్ డ్రోన్లు మోహరించిన అమెరికా
6
Published on: 📅 14 Mar 2026, 03:59 PM
Reporter: 🖊 Anitha Sharma