పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమానయాన సంస్థలు ఇంధన సర్‌ఛార్జీలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో వంటి సంస్థలు ఈ ఛార్జీలు అమలు చేస్తున్నాయి. తాజాగా ఆకాశ ఎయిర్ కూడా మార్చి 15 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ.199 నుంచి రూ.1,300 వరకు ఇంధన సర్‌ఛార్జీ వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు మారుతాయని తెలిపింది. పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఈ ఛార్జీలను సమీక్షిస్తామని సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
విమాన టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీ.. ఆకాశ ఎయిర్ కొత్త నిర్ణయం
6
Published: 📅
Reported by: 🖊
Ramesh Kumar