రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు. రైతులకు పెట్టుబడి, ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. కేంద్రంతో చర్చించి ఆయిల్ పామ్ టన్ను ధరను రూ.12 వేల నుంచి రూ.20 వేలకుపైగా పెంచామని చెప్పారు. ఈ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్యలేమీ లేవని రైతులు ధైర్యంగా సాగు చేయాలని సూచించారు. త్వరలో రైతు మేళా నిర్వహిస్తామని తెలిపారు.
రైతులకు లాభదాయక పంట ఆయిల్ పామ్.. మంత్రి తుమ్మల సూచనలు
10
Published: 📅
Reported by: 🖊
Suresh Reddy