అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర భద్రతా ఘటన ఇప్పుడు డాక్యుమెంటరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తుర్కియేలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ రహస్యంగా విమానం మార్చిన సంఘటనపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్’ పేరుతో డాక్యుమెంటరీని నిర్మించింది.
ఈ డాక్యుమెంటరీలో ట్రంప్ విమానం మార్పు సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్న వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ జర్నలిస్టులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, విమాన సిబ్బంది ప్రత్యక్ష అనుభవాలు, ఇంటర్వ్యూలను చూపించనున్నారు. నిజ జీవితంలో జరిగిన ఉత్కంఠభరిత ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
నాటో సదస్సు కోసం ట్రంప్ ఖతార్ బహుమతిగా ఇచ్చిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తుర్కియే వెళ్లారు. అయితే ఇరాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ప్రాంతం కావడంతో విమానం భద్రతపై నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో భద్రతా సిబ్బంది ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించారు.
అంకారా విమానాశ్రయంలో కెమెరాల ముందు ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి వెళ్లిన తర్వాత, ఎవరికి అనుమానం రాకుండా క్యాటరింగ్ ట్రక్కు సహాయంతో చిన్న మిలిటరీ విమానంలోకి మార్చారు. అనంతరం ఆయన సురక్షితంగా బ్రిటన్‌లోని రాఫ్ మైల్డెన్‌హాల్ వైమానిక స్థావరానికి చేరుకున్నట్లు సమాచారం.
ట్రంప్ విమానం మార్పు రహస్యం.. నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ
15
Published: 📅
Reported by: 🖊
Banu Prakash