trisha reacts strongly to controversial remarks

కామెంట్లపై త్రిష ఘాటు స్పందన

2

Published on: 📅 09 Mar 2026, 10:41 AM
Reporter: 🖊 Suresh Reddy

నటులు విజయ్, త్రిష కలిసి ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరైన విషయంపై వచ్చిన వ్యాఖ్యలకు త్రిష ఘాటుగా స్పందించారు. కొంతమంది కావాలనే తనపై కామెంట్లు చేయిస్తున్నారని ఆరోపించారు. విమర్శలు అవి ఎదుర్కొనే వ్యక్తి కంటే వాటిని చేసే వ్యక్తుల గురించే ఎక్కువ చెబుతాయని పేర్కొన్నారు. విషయం పూర్తిగా తెలియకుండానే మాట్లాడడం మూర్ఖత్వమని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంపై స్పందించినప్పటికీ త్రిష ఎక్కడా పార్తీబన్ పేరు ప్రస్తావించలేదు.

Sponsored