పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 10 రోజుల పాటు తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జరగాల్సిన మిడ్‌టర్మ్ పరీక్షలను కూడా వాయిదా వేసింది. తదుపరి పరీక్షల తేదీలను పరిస్థితులను బట్టి తర్వాత ప్రకటిస్తామని యూనివర్సిటీ వెల్లడించింది.
ఈ సమయంలో విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో తమ స్వస్థలాలకు వెళ్లవచ్చని యాజమాన్యం సూచించింది. ఒక విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందన్న వార్తలు వెలువడటంతో యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు మొదలయ్యాయి. గర్ల్స్ హాస్టల్-3 వద్ద శనివారం అర్ధరాత్రి నిరసనలు ప్రారంభమైనట్లు సమాచారం.
ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని విద్యార్థులు ఆరోపించినట్లు కథనంలో పేర్కొన్నారు. అనంతరం సుమారు 2 వేల మంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. ఆందోళనకారులు జాతీయ రహదారి-44పై కూడా నిరసన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నిరసనల సమయంలో మంటలు చెలరేగడంతో ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
విద్యార్థుల నిరసనలు తీవ్రం.. ఎల్‌పీయూలో 10 రోజుల పాటు క్లాసులు రద్దు.. పరీక్షలు వాయిదా
8
Published: 📅
Reported by: 🖊
Sarika Sk