రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం వెల్లడించింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో డిసెంబరులో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ రద్దు ప్రభావం హైదరాబాద్-రక్సౌల్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లపై పడనుంది. హైదరాబాద్ నుంచి రక్సౌల్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 17005ను డిసెంబరు 10న రద్దు చేశారు. అలాగే రక్సౌల్ నుంచి హైదరాబాద్ వచ్చే 17006 ఎక్స్‌ప్రెస్ రైలును డిసెంబరు 13న రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక తిరుపతి-రక్సౌల్ మార్గంలో నడిచే 17433 ఎక్స్‌ప్రెస్ రైలును డిసెంబరు 7, 14 తేదీల్లో రద్దు చేయనున్నారు. రక్సౌల్-తిరుపతి మధ్య నడిచే 17434 ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబరు 10, 17 తేదీల్లో అందుబాటులో ఉండదు.
అలాగే వాస్కోడిగామా-జాసిద్-వాస్కోడిగామా మార్గంలో నడిచే 17321/17322 ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా డిసెంబరు 11, 14 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నామని, ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
డిసెంబరులో హైదరాబాద్-రక్సౌల్ మధ్య పలు రైళ్లు రద్దు.. నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల ప్రభావం
1