ఢిల్లీలో ఉగ్రదాడి జరగవచ్చని అందిన సమాచారంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై ఉగ్రవాద దాడి జరుగవచ్చని స్పెషల్ సెల్ దర్యాప్తు చేపడుతోంది. 9 మందిని అరెస్టు చేసిన తర్వాత ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు, దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ దాడికి పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి నెట్‌వర్క్ బాధ్యత వహిస్తుందని భావిస్తున్నారు. నిందితులు సోషియల్ మీడియా ద్వారా ఆదేశాలు తీసుకుని, ఉత్తర భారతదేశం మరియు ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపాలని ప్రేరేపించారని పోలీసులు వెల్లడించారు.
గతేడాది రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు బాంబు ఘటనను దృష్టిలో ఉంచుకొని, ఆత్మాహుతి దాడులు, ఆయుధాలు, ఐఈడీలపై దర్యాప్తు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి.
ఢిల్లీలో ఉగ్రదాడి శంకతో హై అలర్ట్
0
Published: 📅
Reported by: 🖊
Sarika Sk