ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు వెల్లడించారు. శనివారం రాత్రికి గోదావరి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు.
గోదావరి వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. వరద ప్రభావం ఉండే పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
లంక గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నదిలో స్నానం చేయడం, చేపలు పట్టడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వరద ప్రవాహం ఉన్న రహదారులపై ప్రయాణాలు చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు కర్నూలు జిల్లాలోని సుంకేసుల డ్యామ్‌కు కూడా వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2500 క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రానికి నీటి మట్టం 1.2 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని, మరో ఏడు రోజుల పాటు వరద కొనసాగవచ్చని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు.
విశాఖపట్నం జిల్లాలో గత నాలుగు రోజుల వర్షాలతో 33.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం.. అధికారుల అప్రమత్తం
2
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk