టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ విజయం గురించి మాట్లాడాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు కఠిన సవాళ్లు ఎదుర్కోవడం అంటేనే ఇష్టమని బుమ్రా పేర్కొన్నాడు. మంచి ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పాడు. గుజరాత్‌లోనే తన క్రికెట్ ప్రయాణం ప్రారంభమైందని, అదే అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ గెలవడం తనకు ప్రత్యేకంగా అనిపించిందని తెలిపాడు. గతంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో తృటిలో ఓడిపోయామని గుర్తుచేసుకున్నాడు.