హైదరాబాద్‌లో వాణిజ్య, గృహ ఎల్పీజీ సిలిండర్ల కొరతపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి బహిరంగ లేఖ రాశారు. నగరంలో గ్యాస్ సరఫరా లోపం కారణంగా హోటళ్లు, హాస్టళ్లు, చిన్న ఆహార వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి ఆహార వ్యాపారాలపై ప్రభావం చూపుతూ వేలాది సంస్థలు మూతపడే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు. వెంటనే సరఫరాను పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు.
గ్యాస్ కొరతపై కేటీఆర్ లేఖ
9