ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో పలువురు అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించే ఉద్దేశంతో వివిధ జిల్లాల్లో గ్రామ పంచాయతీ అధికారులు, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు, జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోలకు కొత్త బాధ్యతలు అప్పగించారు.
బదిలీల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా పి. విజయభాస్కర్ నియమితులయ్యారు. అమలాపురం డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా పి. వసంత మాధవి బాధ్యతలు చేపట్టనున్నారు. అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారిగా ఎస్. మంజుల వాణి, అనకాపల్లి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా కె. రమామణి నియమితులయ్యారు.
అలాగే సత్యసాయి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా ఎం. వెంకటరత్నం, కదిరి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా వి. రామాంజనేయులు నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోగా కె. అనురాధ, అనకాపల్లి జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోగా ఇ. సందీప్ బాధ్యతలు చేపట్టనున్నారు.
సత్యసాయి జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోగా వై. సమంత, మార్కాపురం జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోగా సీహెచ్ దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు. ఆయా అధికారులు తమ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఈ బదిలీలతో పంచాయతీరాజ్ శాఖలో పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొత్తగా నియమితులైన అధికారులు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించనున్నారు.
ఏపీ పంచాయతీరాజ్ శాఖలో భారీ బదిలీలు.. పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan