మీరు కోలుకున్నాక శిక్షణ ఇస్తా.. భారత పైలట్‌తో యూఏఈ అధ్యక్షుడి సరదా సంభాషణ
📅 29-10-2026
ఫ్లై దుబాయ్ విమానంలో ప్రయాణికులను కాపాడేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ సత్కరించారు. దాడిలో గాయపడిన స్మిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కోలుకోవడానికి రెండు నెలలు పడుతుందని స్మిత్ చెప్పగా, ఆ తర్వాత పోరాట శిక్షణ ఇస్తానని అధ్యక్షుడు సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. విమాన సిబ్బందిని కూడా అభినందించిన అధ్యక్షుడు, యూఏఈ ఎప్పటికీ మీ దేశమేనని భరోసా ఇచ్చారు. ఆయన ఆప్యాయతకు స్మిత్ కృతజ్ఞతలు తెలిపారు.