genz wave reshaping nepal politics

నేపాల్ రాజకీయాల్లో యువత హవా

Published on: 📅 07 Mar 2026, 06:53 PM
Reporter: 🖊 Anitha Sharma

సుదీర్ఘకాలంగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్‌లో సంప్రదాయ నేతల ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. Gen-Z ఉద్యమం తర్వాత అక్కడి రాజకీయ దృశ్యం మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత 18 ఏళ్లలోనే 14 ప్రభుత్వాలు మారిన ఈ హిమాలయ దేశంలో త్వరలో యువ నేత సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో సంప్రదాయ పార్టీలను పక్కనబెట్టి నేపాలీ యువ నాయకుడు బాలేంద్ర షా అఖండ విజయ దిశగా దూసుకెళ్తున్నట్లు సమాచారం.

Sponsored