ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయ్యాయి. గత శనివారం (ఫిబ్రవరి 28) ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా, ‘రోరింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టాయి. మొదటి రోజే ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణించినట్లు సమాచారం. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని ఇతర దేశాలకు విస్తరించింది. ఇరాన్లో ఇప్పటివరకు 1200 మందికిపైగా మృతి చెందగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇరాన్ యుద్ధానికి వారం… మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు
Published on: 📅 07 Mar 2026, 10:55 AM
Reporter: 🖊 Anitha Sharma
>
>
>