తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో హీరోయిన్ రష్మిక మందన్న ‘ఉత్తమ నటి’ అవార్డు గెలుచుకోవడంపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రష్మికను ‘తెలంగాణ కోడలు’గా అభివర్ణిస్తూ ఈ అవార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ప్రత్యేక గౌరవం ఇచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు, సినిమాలు చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వారం క్రితమే హీరో విజయ్ దేవరకొండను రష్మిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
>
>
>