పుల్వామా అమరవీరుల పిల్లలకు గత ఏడేళ్లుగా అండగా నిలుస్తున్నట్లు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. తమ స్కూల్లో చదువుతున్న కొందరు పిల్లలు మంచి ప్రతిభ కనబరుస్తుండటం గర్వంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం సైనికులు ప్రాణత్యాగం చేశారని, వారి కలలను కాపాడటం మన బాధ్యత అని అన్నారు. ఈ పిల్లల విజయాలు సంతోషాన్ని ఇస్తున్నాయని, వారి తండ్రులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని సెహ్వాగ్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. జై హింద్ అంటూ దేశభక్తిని చాటుకున్నారు.
పుల్వామా అమరవీరుల పిల్లలకు సెహ్వాగ్ అండ
Published on: 📅 31 Mar 2026, 10:28 AM
Reporter: 🖊