న్యూఢిల్లీ, మే 19: అమెరికా ట్రెజరీ విభాగం రష్యా ముడి చమురుపై ఉన్న ఆంక్షల మినహాయింపును మరోసారి పొడిగించింది. ఈ సడలింపు సముద్ర మార్గంలో ఇప్పటికే ప్రయాణిస్తున్న రష్యన్ చమురు రవాణాలకు వర్తిస్తుంది. కొత్తగా జారీ చేసిన జనరల్ లైసెన్స్ 134C ప్రకారం, ఏప్రిల్ 17కి ముందు సముద్రంలో ఉన్న రష్యన్ చమురు రవాణాలకు జూన్ 17 వరకు అనుమతి కల్పించబడింది. అయితే, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా లేదా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల వ్యక్తులు లేదా సంస్థలతో లావాదేవీలకు ఈ మినహాయింపు వర్తించదు.
అమరికా నిర్ణయం ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భంలో మార్కెట్లను స్థిరంగా ఉంచడానికే తీసుకోబడిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో మార్చి 5 నుంచి ఒక నెలపాటు భారతదేశానికి సహా కొన్ని దేశాలకు రష్యన్ చమురు కొనుగోళ్లలో సడలింపు ఇచ్చారు. ఆ గడువు తర్వాత ఏప్రిల్ 11, మే 16 వరకు పొడిగించి, ఇప్పుడు జూన్ 17 వరకు మళ్లీ విస్తరించారు.
ఇప్పటికీ భారత్ రష్యా చమురును కొనుగోలు చేయడంలో కొనసాగుతుంది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపినట్లు, భారత్ తీసుకునే నిర్ణయాలు పూర్తిగా వాణిజ్య అవసరాలు, సరఫరా పరిస్థితుల ఆధారంగానే ఉంటాయి. “రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ చమురు కొనుగోలు జరిగింది. సడలింపు వచ్చిన తర్వాత కూడా కొన్నాం. భవిష్యత్తులో కూడా రష్యా చమురును కొనుగోలు చేస్తాం. దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల సరిపడా ముడి చమురు అందుబాటులో ఉంది” అని ఆమె వివరించారు.
2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చౌకైన రష్యన్ చమురు భారత్‌కు తక్షణ ఉపశమనం కలిగించి, దేశీయ ముడి చమురు సరఫరాకు కీలకమైనది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో కీలకంగా ఉంది.
రష్యా చమురుపై అమెరికా మరో నెల మినహాయింపు
3
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla