రాజస్థాన్‌లో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో హైవేపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కిషన్‌గఢ్ టోల్‌ప్లాజా సమీపంలో లారీ టైరు పేలడంతో అదుపుతప్పి పడిపోయింది. దాదాపు 145 గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకొని సిలిండర్లను మరో వాహనంలోకి మార్చి రహదారిని క్లియర్ చేశారు.
హైవేపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. క్షణాల్లో గందరగోళం
10
Published: 📅
Reported by: 🖊
Anitha Sharma