సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు కొత్త రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని, తీయని మాటలతో నమ్మకం కలిగించి చివరకు భారీ మొత్తాలను కాజేస్తున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చంటూ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో బాధితులను ఆకర్షిస్తున్నారు. ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనల్లో పెళ్లి పేరుతో పరిచయం పెంచుకున్న మహిళ నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓ వ్యక్తి నుంచి రూ.1.46 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తులు పెట్టుబడుల పేరుతో రూ.2.36 కోట్లు మోసం చేసినట్లు కేసు నమోదైంది.
ఇంకో ఘటనలో ఐపీఓ షేర్ల పేరుతో మొదట లాభాలు చూపించి, ఆ తర్వాత భారీ పెట్టుబడులు పెట్టించిన సైబర్ నేరగాళ్లు బాధితుడిని మోసం చేశారు. ఖాతాలో భారీ లాభాలు కనిపించేలా నకిలీ వివరాలు చూపించి డబ్బు విత్‌డ్రా చేయకుండా అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వచ్చే లింకులు, ఏపీకే ఫైల్స్‌ను తెరవకూడదని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు లేదా మోసం జరిగిన వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వలపు వల.. యువత గిలగిలా.. సోషల్ మీడియా సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక
6
Published: 📅
Reported by: 🖊
Banu Prakash