T20 వరల్డ్‌కప్ సందర్భంగా భారత్‌తో ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించడాన్ని తాను ప్రశంసించినట్లు చూపుతూ రూపొందించిన AI జనరేటెడ్ ఫేక్ వీడియోపై కాంగ్రెస్ నేత Shashi Tharoor తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో, థరూర్‌లా కనిపించే క్లోన్ పాకిస్థాన్ దౌత్యాన్ని మెచ్చుకున్నట్లు ఉంది. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “ఇది పూర్తిగా AI ద్వారా తయారైన ఫేక్ న్యూస్, నా భాష కూడా కాదు, నా గొంతు కూడా కాదు” అంటూ ఖండించారు. ఇలాంటి తప్పుడు వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
AI ఫేక్ వీడియోపై శశి థరూర్ ఘాటు స్పందన
2
Published on: 📅 31 Mar 2026, 11:29 AM
Reporter: 🖊