అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్‌లో త్వరలో నాయకత్వ మార్పు జరగనుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సీఈఓగా కొనసాగుతున్న శంతను నారాయణ్ ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త సీఈఓ ఎంపిక పూర్తయ్యాక ఆయన బాధ్యతలు వీడనున్నారు. అయితే బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతారని అడోబ్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. తదుపరి సీఈఓ ఎంపిక కోసం బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్రియను ప్రారంభించింది.
అడోబ్‌లో నాయకత్వ మార్పు.. సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్న శంతను నారాయణ్
3
Published on: 📅 13 Mar 2026, 02:31 PM
Reporter: 🖊 Suresh Reddy