centre approves disaster relief funds 341 crore for andhra pradesh

ప్రకృతి వైపరీత్యాల సాయం.. ఏపీకి రూ.341 కోట్లు మంజూరు

5

Published on: 📅 13 Mar 2026, 02:37 PM
Reporter: 🖊 Anitha Sharma

ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.1929.99 కోట్ల అదనపు సహాయాన్ని ఆరు రాష్ట్రాలకు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.341.48 కోట్లు కేటాయించారు. 2025లో సంభవించిన ఆకస్మిక వరదలు, మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల పునరుద్ధరణకు ఈ నిధులు వినియోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Sponsored