టీ20 వరల్డ్‌కప్ 2026లో టీమ్‌ఇండియా విజయం వెనుక కొన్ని కీలక నిర్ణయాలు నిలిచాయి. అందులో ప్రధానంగా సంజు శాంసన్ను తుది జట్టులోకి తీసుకోవడం ఒకటని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పోంటింగ్ అభిప్రాయపడ్డాడు.
సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇషాన్ కిషన్ ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు పంపి, సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించారు.
ఈ మార్పు జట్టుకు గేమ్ ఛేంజర్‌గా మారింది. సంజు శాంసన్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిలోనూ నిలకడగా రాణించి జట్టుకు కీలక విజయాలు అందించాడు.
రికీ పాంటింగ్ మాట్లాడుతూ, ఒక ఆటగాడిపై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యమని అన్నారు. ఆటగాడి భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పినప్పుడు అతడు తనలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీస్తాడని తెలిపారు. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం భారత జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిందని విశ్లేషించాడు.
అలాగే వైట్‌బాల్ క్రికెట్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శనపై ప్రశంసలు కురిపిస్తూ, ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు స్థిరంగా మంచి ఫలితాలు సాధిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయం జట్టు వ్యూహం, నమ్మకం, సమయానికి తీసుకున్న నిర్ణయాల ఫలితమని స్పష్టం చేశారు.
సంజు మాస్టర్ స్ట్రోక్.. భారత్‌కు కప్ అందించిన నిర్ణయం
4
Published on: 📅 18 Mar 2026, 11:59 AM
Reporter: 🖊 Ramesh Kumar