పశ్చిమాసియాలో యుద్ధం 13వ రోజుకూ కొనసాగుతూ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్, లెబనాన్‌లోని పౌర లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 21 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండగా హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇరాక్ సమీపంలో అమెరికా నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుపునిచ్చింది. పరిస్థితిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. మరిన్ని దాడులపై ఇరాన్ హెచ్చరిక
5
Published: 📅
Reported by: 🖊
Anitha Sharma