indian-stock-markets-surge-after-trump-announces-peace-deal-with-iran

భారత స్టాక్‌ మార్కెట్లు ట్రంప్ శాంతి ప్రకటనతో భారీ లాభాల్లో ముగిశాయి

9

Published: 📅
Reported by: 🖊 Eswar Pavan

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య త్వరలో శాంతి ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు, అంతర్జాతీయంగా ముడిచమురు దిగుమతులు తగ్గడం మార్కెట్‌లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ను కలిగించింది. సెన్సెక్స్ ట్రేడింగ్‌లో ఓ దశలో 1700 పాయింట్లకు పైగా లాభపడింది, చివరికి 75,527.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 23,622.90 వద్ద స్థిరపడింది.

బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.452.33 లక్షల కోట్ల నుంచి రూ.462.05 లక్షల కోట్లకు చేరింది. ఉదయం 74,709.27 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ఇంట్రాడేలో 75,608.02 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి, చివరికి 1695 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 461.30 పాయింట్ల లాభంతో స్థిరపడింది. రూపాయి మారకం విలువ 95.11 వద్ద నిలిచింది.

సెన్సెక్స్ సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇండిగో, టైటాన్‌, ఎటర్నల్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ షేర్లు మాత్రమే నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల్లో బ్రెంట్ క్రూడ్‌ 86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 4224 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ త్వరలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరొచ్చని, హర్మూజ్‌ తిరిగి తెరుచుకుంటుందని వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు, భారత మార్కెట్ లాబ్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. జపాన్ నిక్కీ 3%, దక్షిణ కొరియా కోస్పీ 4% లాభంలో ముగిసింది. యూరోపియన్ మార్కెట్‌లూ లాభాలతో ప్రారంభమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్