india lost to south africa by 76 runs t20wc super 8

సూపర్-8లో భారత్‌కు భారీ షాక్… సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో పరాజయం

1

Published on: 📅 31 Mar 2026, 05:36 AM
Reporter: 🖊

సూపర్-8 దశలో అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన కీలక పోరులో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూర్య సేన 111 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అభిషేక్ 15, తిలక్ 1, సూర్య 18, సుందర్ 11 పరుగులు చేశారు. దూబే 42 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ 3, మార్కో 4 వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు. ఈ పరాజయంతో మిగిలిన రెండు మ్యాచ్‌లు భారత్‌కు కీలకంగా మారాయి.

Sponsored